ప్రభాస్ తోనే ‘జనగణమన’.. పూరి అదిరిపొయే స్కెచ్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఇస్మార్ట్ శంకర్ హిట్ తో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కిన డైరక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. పూరి మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాగా పూరి ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండకు యూత్ లో ఉన్న ఫాలోయింగ్ ను కూడా పరిగణలో తీసుకుని పూరి ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత పూరి మహేష్ తో తీద్దామనుకున్న జనగణమన సినిమా చేస్తాడని తెలుస్తుంది.

జనగణమన కథ దాదాపు నాలుగేళ్లుగా పూరి దగ్గర ఉన్న కథ ఇది. అయితే మహేష్ ఇప్పుడప్పుడే పూరికి ఛాన్స్ ఇచ్చేలా లేడు. అందుకే పూరి జగన్నాథ్ ఆ సినిమాలో హీరోని మార్చేస్తున్నాడట. లేటెస్ట్ గా జనగణమన సినిమాను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. పూరి డైరక్షన్ లో ప్రభాస్ బుజ్జిగాడు సినిమా చేశాడు.

బాహుబలి రెండు పార్టులు, సాహో సినిమాలతో ప్రభాస్ నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నాడు. సాహో సినిమా తెలుగులో కన్నా హిందిలో మంచి వసూళ్లు సాధిస్తుంది. అందుకే పూరి కూడా ప్రభాస్ తో జనగణమన తీయాలన్న స్కెచ్ వేస్తున్నాడు. మరి ప్రభాస్ పూరికి ఛాన్స్ ఇస్తాడా లేదా అన్నది చూడాలి.

Share.