ఆరెక్స్ 100 సినిమాతో యువత హృదయాలను కొల్లగొట్టిన పాయల్ రాజ్ పుత్ లేటెస్ట్ గా ఆర్.డి.ఎక్స్ లవ్ అంటూ మరో ఆటం బాంబ్ లా వస్తుంది. కేవలం పాయల్ అందాలనే నమ్ముకోకుండా ఈ సినిమా కథ కూడా కొత్తగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆర్.డి.ఎక్స్ లవ్ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాతో పాటుగా పాయల్ రాజ్ పుత్ వెంకీమామ, డిస్కో రాజా సినిమాల్లో నటిస్తుంది.
ఇక వీటితో పాటుగా వేరే సినిమాల కథా చర్చలు జరుగుతున్నాయట. రీసెంట్ గా తేజ డైరక్షన్ లో పాయల్ ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తుందని వార్తలు వచ్చాయి. తేజ కథ పాయల్ కు నచ్చడం.. సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయడం కూడా జరిగిందట. ఆల్రెడీ కాజల్ సీత సినిమాలో పాయల్ తో ఓ స్పెషల్ సాంగ్ చేయించాడు తేజ. మళ్లీ ఆమెతోనే లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయాలని చూస్తున్నాడు.
యూత్ లో పాయల్ కు ఉన్న ఫాలోయింగ్ తెలుసుకున్న తేజా ఆమెతో లేడీ ఓరియెంటెడ్ మూవీ ప్లాన్ చేశాడు. ఈ సినిమా వర్క్ అవుట్ అయితే మళ్లీ తేజ ఫాం లోకి వచ్చే అవకాశం ఉంది. తేజ డైరక్షన్ లో పాయల్ రాజ్ పుత్ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో హిట్ ట్రాక్ లోకి వచ్చిన తేజ సీత సినిమాతో మళ్లీ వెనక్కి వెళ్లాడు.