పవర్ స్టార్ ఛాన్స్ అందుకున్న పూజా హెగ్దె..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రస్తుతం తెలుగులో సూపర్ ఫాం లో ఉన్న హీరోయిన్ ఎవరు అంటే అందరు చెప్పే పేరు ఒకటే అదే పూజా హెగ్దె. ముకుంద, ఒక లైలా కోసం సినిమాలు ఫ్లాప్ అయినా డిజే సినిమాతో అమ్మడి ఫేట్ మారిపోయింది. అప్పటినుండి పూజా వరుసగా స్టార్ సినిమాలను చేస్తూ అలరిస్తుంది. రీసెంట్ గా వచ్చిన గద్దలకొండ గణేష్ సినిమాతో కూడా పూజా తన ఖాతాలో ఓ సూపర్ హిట్ వేసుకుంది.

ఇక అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాతో పాటుగా ప్ర్భాస్ జాన్ సినిమాలో కూడా పూజా హెగ్దె నటిస్తుంది. ఇదే కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించబోయే పింక్ రీమేక్ లో ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తుంది. అజ్ఞాతవాసి తర్వాత పవన్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ లో ఆల్రెడీ హిట్ అయిన ఈ సినిమాను తమిళంలో అజిత్ రీమేక్ చేశారు.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ సినిమా రీమేక్ చేస్తున్నారు. దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె నటించడం సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఈ సినిమాతో పాటుగా మరో రెండు క్రేజీ ప్రాజెక్టులలో డిస్కస్ చేస్తుంది పూజా. మరి చూస్తుంటే అమ్మడి మరో మూడు నాలుగేళ్లు ఈ ఫాం కొనసాగేలా ఉంది.

Share.