నిర్మాతలకు గుదిబండగా మారిన టాలీవుడ్ హీరోయిన్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఒక హిట్టు రెండు ఫ్లాపులతో కెరియర్ సాగిస్తున్న ఓ తెలుగు హీరోయిన్ రెమ్యునరేషన్ కాకుండా చేసే ఎక్స్ ట్రా ఖర్చులకు నిర్మాతలు బోరున మొత్తుకుంటున్నారు. స్టార్ హీరోయిన్స్ కూడా చేయని ఖర్చులు ఈ అమ్మడు చేస్తుందట. అంతేకాదు ఎక్కడికి వెళ్ళినా సరే ఆమెకు బిజినెస్ క్లాస్ టికెట్స్ తీసుకోవాల్సిందే అని తెలుస్తుంది. తను ఒక్కదానికే కాదు తన మదర్ కు కూడా ఎక్కడికి వెళ్తే అక్కడకు ఫ్లైట్ టికెట్స్ వేయించాలని అంటుందట.

అంతేకాదు ఆమెని ఏదైనా హోటల్ లో దించితే ఆ హోటల్ బిల్ చూసి నిర్మాతలు షాక్ అవడం ఖాయమట. రెమ్యునరేషన్ కాకుండా ఈ అమ్మడు మిగతా ఖర్చులతో ఎక్కువ జల్సా చేస్తుందని అందరు అంటున్నారు. తను వాడే చేతి రుమాలు ఖర్చు కూడా నిర్మాతల మీద వేస్తుందని ఫిల్మ్ నగర్ టాక్.

ఆమె టార్చర్ మరి శృతిమించుతుందని అంటున్నారు. ఎవరైనా ఎదురు తిరిగి ఏంటి మేడం ఈ ఖర్చు అని అడిగితే సినిమా మధ్యలో ఆమె తప్పుకుంటా అని బెదిరిస్తుందట. ఈమధ్య ఆమె ఒక సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్ కన్నా 20 లక్షలు ఎక్స్ ట్రా ఖర్చు అయ్యిందట. ఇది విన్న కొంతమంది నిర్మాతలు ఆ హీరోయిన్ కోసం ప్రయత్నించడమే వేస్ట్ అని భావిస్తున్నారు.

Share.