అతనో క్రేజీ హీరో.. అమ్మడు ఒక పాపులర్ హీరోయిన్ ఇద్దరు కలిసి ఆల్రెడీ ఒక సినిమాలో నటించి హిట్టు కొట్టారు. ఇప్పుడు మరో సినిమాలో కూడా కలిసి చేస్తున్నారు. హిట్ కంబినేషన్ అయ్యే సరికి ఇద్దరు నటిస్తున్న ఈ సినిమాపై కూడా అంచనాలు పెరిగాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా పోస్టర్, ప్రోమోలు అన్ని అలరిస్తున్నాయి. ఇక ఈ సినిమా హీరో, హీరోయిన్ ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా లవ్ లో పడ్డారని తెలుస్తుంది.
ఇద్దరు డేటింగ్ లో ఉన్నారని కొందరు పక్కా చెబుతున్నా ఆ ఇద్దరు మాత్రం ఈ విషయంపై నోరు విప్పట్లేదు. సెట్స్ లో కూడా హీరో, హీరోయిన్ ప్రైవేట్ గా గడుపుతున్నారట. ఆమె ఎక్కడ ఉంటే అక్కడే ఈ హీరో కనిపిస్తున్నాడట. అంతేకాదు ఆమె కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడట. ఇదంతా ఆమె ఉన్న ఇష్టంతోనే అని తెలుస్తుంది.
అయితే ఈ హీరోకి ఇప్పటికే మరో తెలుగు హీరోయిన్స్ కు లింక్ పెడుతూ చాలా వార్తలు వచ్చాయి. ఆ హీరోయిన్ ఇప్పుడు ఫేడవుట్ అవగా ఇప్పుడు కొత్త హీరోయిన్ తో వ్యవహారం నడిపిస్తున్నాడట. మరి ఈ ఇద్దరి ప్రేమ పెళ్లి దాక వెళ్తుందా లేక జస్ట్ ఫర్ ఫన్ అని ఎవరి దారి వారు చూసుకుంటారా అన్నది చూడాలి