టాలివుడ్‌లో మళ్ళి డ్రగ్స్ కలకలం…?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలివుడ్ లో మళ్ళీ డ్రగ్స్ కలకలం రేగిందా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ఇటీవల కొందరిని పోలీసులు డ్రగ్స్ ఆరోపణలతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో నైజీరియాకి చెందిన ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసారు… అయితే వాళ్ళ విచారణలో కొన్ని ఆసక్తికర విషయాలను వాళ్ళు బయటపెట్టినట్టు తెలుస్తుంది. ఇది ఎంత వరకు నిజం అనేది తెలియదు గాని సోషల్ మీడియాలో మాత్రం కొన్ని వార్తలు డ్రగ్స్ మీద అప్పుడు హల్చల్ చేస్తున్నాయి…

ఒక నటుడుని, ఒక హీరోని వాళ్ళు డ్రగ్స్ విక్రయించేందుకు కలిసినట్టు తెలుస్తుంది… వాళ్ళు సంప్రదించిన వెంటనే… నటులు పోలీసులకు సమాచారం ఇచ్చారని, ఒక హీరోయిన్ తో కూడా వాళ్ళు సంప్రదింపులు చేసారని పోలీసు విచారణలో వెల్లడైందని అంటున్నారు. వెంటనే అప్రమత్తమై మళ్ళీ తమకు ఈ డ్రగ్స్ మరక వద్దని భావించే వాళ్ళు దూరంగా ఉన్నారని అంటున్నారు. ఇక కొన్ని టీవీ షోలలో నటించే వాళ్ళను కూడా డ్రగ్స్ మాఫియా సంప్రదించింది అనే ప్రచారం ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది.

ఇప్పుడు సిని పరిశ్రమ ఈ డ్రగ్స్ పేరు వింటేనే భయపడిపోతుందని అంటున్నారు. దాని కారణంగా కెరీర్ పోతుంది, అభిమానుల్లో చులకన అయిపోతాం, మీడియాలో అల్లరైపోతాం అనే భావనలో సిని పరిశ్రమ ఉంది. అందుకే వాటికి చాలా వరకు దూరంగా ఉన్నారని సమాచారం. ఒక దర్శకుడు అయితే విదేశాలకు కూడా వెళ్ళడం మానేసినట్టు ప్రచారం జరుగుతుంది. ఇన్నాళ్ళు ఇబ్బంది పడిన తన కెరీర్ ని గాడిలో పెట్టుకునే పనిలో ఆ దర్శకుడు ఉన్నాడని, యువ హీరోలతో సినిమాలు చేసి మళ్ళీ హిట్ దర్శకుడిగా పేరు నిలబెట్టుకోవాలని భావిస్తున్నారట.

Share.