ఇంటి గుట్టు బయటపెట్టిన వారిపై త్రివిక్రం ఫైర్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

త్రివిక్రం, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ అల వైకుంఠపురములో. హారిక హాసిని, గీతా ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాకు సంబందించిన సాంగ్స్ 3 రిలీజై అవన్ని సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా ఒకప్పటి క్లాసిక్ మూవీ ఇంటిగుట్టుకి అనఫిషియల్ రీమేక్ అదే కాపీ అంటున్నారు.

ఎన్.టి.ఆర్ నటించిన ఆ సినిమా కథతోనే అల వైకుంఠపురములో సినిమా లైన్ రాసుకున్నాడట. అయితే ఇది కేవలం తన అసిస్టెంట్ డెరిరక్టర్స్ వల్లే బయటకు వచ్చిందని వారందరిని పిలిచి గట్టిగా క్లాస్ పీకాడట త్రివిక్రం. త్రివిక్రం తీస్తున్న ప్రతి సినిమాకు ఇలాంటి రూమర్స్ రావడంపై త్రివిక్రం చాలా అప్సెట్ అవుతున్నాడట. అవసరమైతే కొత్త టీం తెచ్చుకుంటా ఇంకోసారి ఇలా జరగకూడదని వార్నింగ్ ఇచ్చాడట.

బన్నితో త్రివిక్రం ఇప్పటికే రెండు సినిమాలు చేశాడు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి రెండు సినిమాలు హిట్ అయ్యాయి. మరి రాబోతున్న ఈ హ్యాట్రిక్ మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఈ సినిమా సాంగ్స్ ఇప్పటికే సూపర్ హిట్ అవగా సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఉంటుందని అంటున్నారు.

Share.