మెగా ఫ్యామిలీ సినిమాలో ఛాన్స్ అంటే ఎవరికైనా లక్కీ ఛాన్స్ అన్నట్టే. ఎందుకంటే ఒక హీరో సినిమాలో మంచి క్యారక్టర్ పడి క్లిక్ అయితే ఇక వారికి అవకాశాలు వచ్చేస్తాయి. ప్రస్తుతం ఓ యాంకర్ వరుసగా మెగా ఛాన్సులు అందుకుంటుంది. ఇంతకీ ఆ యాంకర్ ఎవరంటే అనసూయ అని తెలుస్తుంది. రాం చరణ్ రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించి మెప్పించింది అనసూయ.
సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ కొట్టింది. ఇక ఇప్పుడు సుకుమార్ అల్లు అర్జున్ సినిమాలో కూడా అనసూయని తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ మూవీలో కూడా అనసూయకు ఓ మంచి పాత్ర ఇస్తున్నాడట సుకుమార్. మెగా ఫ్యామిలీ సపోర్ట్ తో అనసూయ వరుస ఛాన్సులు అందుకుంటుంది.
సాయి ధరం తేజ్ విన్నర్ సినిమాలో అనసూయ స్పెషల్ సాంగ్ చేసింది. అయితే ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా రంగస్థలం సినిమాతో హిట్ అందుకోవడంతో వరుసగా మెగా మూవీల్లో అవకాశాలు కొట్టేస్తుంది అనసూయ. ఓ రకంగా అనసూయ కూడా వారి లక్కీ సెంటిమెంట్ అని చెప్పొచ్చు. మరి సుక్కు, బన్ని సినిమాలో అనసూయ పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి.