ఆ డైరెక్ట‌ర్‌తో సినిమా అంటే దండం పెట్టేస్తోన్న మెగా ఫ్యామిలీ..

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలివుడ్ లో తక్కువ కాలంలోనే యాక్షన్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుల్లో బోయపాటి శ్రీను ఒకరు. భద్ర సినిమాతో కెరీర్ మొదలుపెట్టి నేడు ఆయన అగ్ర దర్శకుడి స్థాయికి వెళ్ళారు. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ తో, అల్లు అర్జున్ తో, జూనియర్ ఎన్టీఆర్ తో ఆయన సినిమాలు చేసారు. బాలకృష్ణ తో చేసిన రెండు సినిమాలు కూడా మంచి హిట్ అయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన దమ్ము సినిమా ఫ్లాప్ అయింది. ఇక ఇదే సమయంలో ఆయన ఒక సామాజిక వర్గానికి కూడా దగ్గరయ్యారు.

ఇప్పుడు ఇదే ఆయనకు ఇబ్బందిగా మారిందని అంటున్నారు. రామ్ చరణ్ తో కలిసి ఆయన వినయ విధేయ రామ సినిమాను తీసారు. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది… అప్పుడు మెగా ఫ్యామిలీ అభిమానుల నుంచి ఒక విమర్శ ఎక్కువగా వినపడింది. ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన దర్శకుడు అని అందుకే ఈ సినిమాను ఇలా తీసాడని ఆయనతో మెగా ఫ్యామిలీ భవిష్యత్తులో సినిమాలో చెయ్యొద్దని సూచించారు కొందరు. ఆయనతో సినిమా చేస్తే తాము చూసేది లేదని కూడా కొందరు చెప్పారట.

ఇదే విషయాన్ని చిరంజీవి ఫాన్స్ అసోసియేషన్ చైర్మన్ స్వామి నాయుడుకి కొన్ని అభిమాన సంఘాలు చెప్పాయట. దీనికి సంబంధించి మెగా ఫ్యామిలీలో కూడా ఎక్కువగానే చర్చ జరిగిందని సమాచారం. ఆయనతో సినిమా చేయవద్దని మెగా హీరోలకు చిరంజీవి చెప్పారట. ఇటీవల ఒక యువ హీరో తో ఆయన సంప్రదింపులు జరపగా వద్దనే సమాధానం వినపడిందని వార్తలు వస్తున్నాయి. అభిమానుల కోరిక మేరకే మెగా ఫ్యామిలీ ఆయనకు దూరంగా ఉందని భవిష్యత్తులో ఆయనతో సినిమాలు కూడా వాళ్ళు చేసే అవకాశం లేదని అంటున్నారు.

Share.