ఈ రోజుల్లో సినిమా మార్కెట్ భారీగా పెరిగింది. దర్శక నిర్మాతలు ఆ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకునే సినిమాలు చేస్తున్నారు. గతంలో మాదిరిగా కలెక్షన్లు రాని సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. సందేశాత్మక చిత్రాలు చెయ్యడానికి కూడా అంతగా మోగ్గు చూపడం లేదు. ఈ నేపధ్యంలోనే చాలా మంది నిర్మాతలు అగ్ర హీరోలతో సినిమాలు చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వాళ్ళ సినిమాలకు మంచి మార్కెట్ ఉండటం కలెక్షన్లు వంద కోట్లకు పైగా ఉండటంతో వాళ్ళతో సినిమా కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే ఇక్కడ అగ్ర హీరోలు అంటే చాలు కొంత మంది నిర్మాతలు భయపడిపోతున్నారు. వాళ్ళే ప్రభాస్, మహేష్ బాబు… ప్రభాస్ మిర్చి సినిమా తర్వాత బాహుబలి సినిమా చేసాడు… ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత రెండేళ్ళు ఆగి సాహో సినిమా చేసాడు. ఆ సినిమా ఊహించిన స్థాయిలో విజయం సాధించలేదు. భారి అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఇప్పుడు ప్రభాస్ మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది.
ఇక మహేష్ బాబు విషయానికి వస్తే… సినిమా చేయడానికి దాదాపు 18 నెలలు సమయం తీసుకుంటున్నాడు. ఆ సినిమా వచ్చిన తర్వాత విజయం సాధించకపోతే ఇబ్బంది పడుతున్నారు నిర్మాతలు… 2010 నుంచి మహేష్ సినిమాల్లో ఎక్కువ ఫ్లాపులే ఉన్నాయి. దీనితో చిన్న హీరోలతో త్వరగా అయిపోయే సినిమాలు చేస్తే ఏ ఇబ్బంది ఉండదు అనే భావనలో నిర్మాతలు ఉన్నారట. నాని, శర్వానంద్ వంటి హీరోల మీద దృష్టి పెడుతున్నారట నిర్మాతలు. భారీగా పెట్టుబడి పెట్టె నిర్మాతలు అయితేనే వాళ్ళతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని అంటునారు.