టాలీవుడ్ లో ఎప్పుడు హీరోయిన్స్ కొరత ఉన్న విషయం తెలిసిందే. స్టార్స్ తో పాటుగా సీనియర్ స్టార్స్ కు తమకు తగిన జోడీ వెతకడం కష్టమవుతుంది. ఈ క్రమంలో ఆడియెన్స్ లో కాస్త కూస్తో క్రేజ్ ఉన్న భామలను సెలెక్ట్ చేస్తున్నారు. పెళ్లైనా సమంత వరుస సినిమాలు చేస్తుంది. కాజల్, తమన్నా, అనుష్క కేటగిరి వేరే అయ్యింది. ఇక ఇప్పుడు ఫాంలో ఉన్నది పూజా హెగ్దె, రష్మిక వీళ్లతో పాటుగా ఆరెక్స్ 100 భామ పాయల్ రాజ్ పుత్ కూడా ఫుల్ స్వింగ్ లో ఉంది.
సినిమాలో కొన్ని లిప్ లాక్స్, హాట్ సీన్స్ ఉన్నాయంటే చాలు దర్శక నిర్మాతలు ఈ పాత్రకు పాయల్ పర్ఫెక్ట్ అని ఫిక్స్ అవుతున్నారు. ఆరెక్స్ 100 తర్వాత ఆర్డిఎక్స్ లవ్ సినిమా చేసినా అది వర్క్ అవుట్ అవలేడు. ప్రస్తుతం వెంకటేష్ తో వెకీమామ, రవితేజతో డిస్కో రాజా సినిమాల్లో నటిస్తున్న పాయల్ రాజ్ పుత్ వెంట నిర్మాతలు క్యూలు కడుతున్నారట.
ఆమె ఒప్పుకుంటే సినిమా యూత్ ఆడియెన్స్ కు చేరువయ్యే అవకాశం ఉందని. ఆమె డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారట. రిలీజ్ అవ్వాల్సిన సినిమాలే కాదు డిస్కషన్స్ లో కూడా మరో మూడు సినిమాలు ఉన్నాయట. ఏ టైంలో అజయ్ భూపతి పాయల్ ను తెలుగు తెరకు పరిచయం చేశాడో కాని అమ్మడికి ఇక్కడ ఫుల్ డిమాండ్ ఏర్పడింది.