రష్మిక మాజీ లవర్ ను ప్రమోట్ చేస్తున్న దిల్ రాజు..!

0

కన్నడ భామ రష్మిక మందన్న తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. మహేష్ సరిలేరు నీకెవ్వరుతో పాటుగా నితిన్ భీష్మ సినిమాలో కూడా నటిస్తుంది రష్మిక. ఇదే కాదు సుకుమార్, అల్లు అర్జున్ కాంబో మూవీ ఛాన్స్ కూడా అందుకుంది రష్మిక. ఇదిలాఉంటే ఈమధ్య దిల్ రాజు నిర్మించే ఒక సినిమా ఛాన్స్ వచ్చినా సరే అమ్మడు చేయనని చెప్పిందట. అలా చెప్పడంతో దిల్ రాజు చాలా అప్సెట్ అయ్యాడని తెలుస్తుంది.

ఇక మరోపక్క కన్నడలో రష్మిక మాజీ లవర్ రక్షిత్ శెట్టి చేసిన సినిమా తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. అతడే శ్రీమన్నారాయణ సినిమా తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారట. ఈమధ్య వచ్చిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను అలరించింది. తప్పకుండా రక్షిత్ కు తెలుగులో కూడా క్రేజ్ వచ్చేలా ఉందని అంటున్నారు.

రష్మిక తన సినిమా కాదన్న కారణంతోనే ఆమె మాజీ లవర్ ను దిల్ రాజు ప్రమోట్ చేస్తున్నాడని కొందరు అంటున్నారు. అయితే దిల్ రాజు మాత్రం టీజర్, ట్రైలర్ నచ్చిన ఏ సినిమా అయినా తను రిలీజ్ చేస్తాడు కాబట్టి అతడే శ్రీమన్నారాయణ సినిమా ట్రైలర్ నచ్చే ఆ సినిమాను కొని తెలుగులో రిలీజ్ చేస్తున్నారని తెలుస్తుంది. 2020 లో ఆల్రెడీ సరిలేరు నీకెవ్వరు ఓన్ ప్రొడక్షన్ లో వస్తుంది. అల వైకుంఠపురములో కూడా దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడు. ఎంత మంచివాడవురా కూడా దిల్ రాజు చేతుల్లోనే ఉందట. మొత్తానికి 2020 దిల్ రాజు భారీ ప్లాన్ లోనే ఉన్నాడని అనిపిస్తుంది.

Share.