శ్రీవిష్ణు ‘ తిప్ప‌రా మీసం ‘ రివ్యూ (వన్ మ్యాన్ షో)..

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు సినిమా రంగంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రయాణం మొదలుపెట్టి హీరోగా మారిన నటుడు శ్రీవిష్ణు. చిన్న చిన్న సినిమాలు చేసి విజయాలు సొంతం చేసుకున్న శ్రీవిష్ణు తాజాగా నటించిన చిత్రం ‘తిప్పరా మీసం’. రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్స్, కృష్ణ విజయ్ ఎల్ ప్రొడక్షన్స్ పతాకాలపై శ్రీ హోమ్ సినిమాస్ సమర్పణలో యువ నిర్మాత రిజ్వాన్ నిర్మించారు. నిక్కి తంబోలి హీరోయిన్‌గా, సీనియర్ నటి రోహిణి హీరో తల్లి పాత్ర పోషించారు. ‘అసుర’ ఫేమ్ విజయ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది.

అయితే అసలు విషయానికొస్తే…. సినిమా మొత్తం శ్రీ విష్ణు భుజాన వేసుకుని నడిపించాడనే చెప్పొచ్చు. మణి పాత్రలో శ్రీవిష్ణు నటన అదిరిపోయింది. భిన్నమైన పాత్రలని ఇష్టపడే ప్రేక్షకులకు ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక విష్ణు తర్వాత సినిమాలో ప్రధాన పాత్ర రోహిణిదే. విష్ణు తల్లి పాత్రలో రోహిణి ఒదిగిపోయారు. ముఖ్యంగా ఇందులో తల్లీకొడుకుల సెంటిమెంట్ అద్భుతంగా పండింది. తల్లీకొడుకులుగా రోహిణి, శ్రీవిష్ణు వారి పాత్రల్లో జీవించారు. ఇక ఆఖరి 30 నిమిషాలు అయితే సినిమా ఓ లెవెల్లో ఉంటుంది.

హీరోయిన్ నిక్కి తంబోలికి సినిమాలో అంత స్కోప్ లేదనే చెప్పొచ్చు. కాకపోతే తన పాత్ర పరిధి వరకు బాగానే చేసింది. ఇక డైరక్షన్ కొంచెం వీక్ గా ఉందనే చెప్పాలి. అలాగే పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. సినిమా మొదటి భాగం కొంచెం నిదానంగా సాగితే, సెకండాఫ్ లో అక్కడక్కడ బోరు కొట్టే సీన్లు ఉన్నాయి. అయితే క్లైమాక్స్ మెప్పిస్తుంది. మొత్తానికి చూసుకుంటే సినిమాలో శ్రీవిష్ణునే హైలైట్. ఆ తర్వాత రోహిణి తన పాత్రలో అద్భుతంగా నటించారు. భిన్నమైన సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. మొత్తానికైతే సినిమా పర్వాలేదనిపించేలా ఉంది.

Share.