సాహో రివ్యూ అండ్ రేటింగ్…!!

Google+ Pinterest LinkedIn Tumblr +

నటీనటులు: ప్రభాస్, శ్రద్ధ కపూర్, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేశ్, అరుణ్ విజయ్, ఎవ్లీన్ శర్మ, మందిరా బేడీ తదితరులు

సినిమాటోగ్రఫీ: ఆర్.మది

మ్యూజిక్: తనిష్క్ బగ్చీ, గురు రాంద్వా, బాద్షా, జిబ్రాన్

ఎడిటర్ : ఎ.శ్రీకర్ ప్రసాద్

నిర్మాణం: యూవీ క్రియేషన్స్, టీ సిరీస్

కథ, దర్శకత్వం: సుజీత్

విడుదల తేది.30-08-2019

బాహుబలి సినిమా ప్రభాస్ జాతీయస్థాయి హీరోగా మారాడు. ఇప్పుడు 350 కోట్ల ఖర్చుతో వచ్చిన సాహో సినిమా ఎంతో హైప్ సాధించింది. రన్ రాజా రన్ సినిమాతో వచ్చిన దర్శకుడు సుజిత్ వెంటనే ఓ భారీ బడ్జెట్ సినిమాను టేకప్ చేశాడు. అయితే ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో… ఓ సారి చూద్దాం…

కథ: ప్రపంచంలోనే ఎక్కువ క్రైమ్ రేట్ ఉండే వాజీ సిటీలో.. ఓ మాఫీయా ముఠాకు లీడర్ అయిన రాయ్.. ఓ గ్రూప్ ను ఫామ్ చేసి, అండర్ వరల్డ్ సామ్రాజ్యాన్ని శాసిస్తుంటాడు.. అయితే రాయ్ ను చేరదీసిన పృధ్వీరాజ్ తనయుడు దేవరాజ్.. రాయ్ మీద పగపెంచుకుని ఆ స్థానాన్ని ఆక్రమించుకోవాలని అనుకుంటుంటాడు.. ఈ నేపథ్యంలో ఓ పనిమీద ముంబై వచ్చిన రాయ్ యాక్సిడెంట్ లో చనిపోతాడు. అదే సమయంలో రెండు లక్షల కోట్లతో వస్తున్న ఓ షిప్ పేలిపోతుంది. రాయ్ వారసుడిగా.. తన కొడుకైనా విశ్వఖ్ మాఫీయా సామ్రాజ్యానికి బాస్ అవుతాడు. మరోవైపు ముంబైలో రెండు వేల కోట్ల రూపాయల దొంగతనం జరుగుతుంది..

ఈ కేస్ ను ఇన్వెస్టిగేట్ చేయడానికి అండర్ కవర్ కాప్ గా అశోక్ చక్రవర్తి వస్తాడు..క్రైమ్ బ్రాంచ్ కు చెందిన అమృతా నాయర్ తో కలిసి ఆ కేసును విచారిస్తూ ఉంటాడు. ఆ సమయంలో వారిద్దరి మధ్య ప్రేమ పుడుతుంది. చివరకు అశోక్ ఆ కేసును ఎలా పరిష్కరించాడు.. రాయ్ ప్రమాదానికి గల కారణాలు ఏమిటి? అశోక్ అమృతల ప్రేమ ఏమౌతుంది..? చివరకు అండర్ వరల్డ్ సామ్రాజ్యానికి బాస్ ఎవరు అయ్యారు.. అనేది సినిమా చూసి తెలుసుకోవాలసిందే.

నటీనటులు: బాహుబలితో తన రేంజ్ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకడంతో ఆ తరువాత చెయ్యబోయే సినిమా కోసం చాలా అలోచించి సాహో ని పిక్ చేసాడు ప్రభాస్. బాహుబలితోనే సాహోరే అనిపించుకున్న రెబల్ స్టార్ సాహో కోసం తనని తాను పూర్తిగా మార్చుకున్నాడు. మాచో వారియర్ లుక్ నుండి స్టైలిష్ ఫైటర్ లుక్ లోకి మారిన విధానం, దానికి పడిన కష్టం మెచ్చుకోవాల్సిందే. ఓవర్ ఆల్ గా ప్రభాస్ సాహో కి తన తరపున చేయగలిగినంత చేసాడు.ఇప్పటి వరకు మాములు హీరోయిన్ గా కనిపించిన శ్రద్దా ఈ సినిమాతో తనలో ఒక యాక్షన్ హీరోయిన్ కూడా దాగుందని నిరూపించింది. పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూనే అవసరం వచ్చినప్పుడు కర్తవ్యంలో విజయశాంతిలా ఫైట్స్ చేసి మెప్పించింది. గ్యాంగ్ స్టర్స్ పాత్రల్లో నటించిన చుంకీపాండే, నీల్ నితిన్, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, లేడీ డాన్ మందిరా బేడీలు మెప్పించారు. పోలీస్ ఆఫీసర్ గా మురళీ శర్మ తన పరిధిమేరకు నటించి మెప్పించాడు.

సాంకేతిక విభాగం: ఇంత భారీ సినిమాలో సర్ ప్రైజింగ్ ఫ్యాక్టర్ మాత్రం డైరెక్టర్ సుజీత్. సినిమాలో ఆ రేంజ్ స్టోరీ కానీ, ఊహలకు అందకుండా సాగిపోయే స్క్రీన్ ప్లే కానీ ఎక్కడ కనిపించలేదు. ఇంటర్వెల్ లో ఉన్న ట్విస్ట్ పర్లేదు అనిపించి సెకండ్ హాఫ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. కానీ సెకండ్ ఆఫ్ మాత్రం డల్ గా సాగింది. అస్తవ్యస్తమయిన స్క్రీన్ ప్లే తో అసలు సినిమాలో ఏం జరుగుతుంది అన్న కన్ఫ్యూజన్ కూడా ఏర్పడింది.

ఫస్ట్ హాఫ్ ఎదో ఉంది అనిపించిన సుజీత్ సెకండ్ హాఫ్ లో ఏం లేదు అని క్లారిటీ ఇచ్చేసాడు. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఊహించగలిగినంత సాదాసీదాగా ఉంది. కానీ దుబాయ్ లో తీసిన యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం ఒక రేంజ్ లో ఉన్నాయి. ఉన్నంతలో ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ అంటే కెన్నీ బీట్స్ ఆధ్వర్యంలో చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రమే. ఇక లాస్ట్ మినిట్ లో సినిమాలోకి ఎంటర్ అయినా గిబ్రాన్ తన టాలెంట్ ని పూర్తిగా ఈ సినిమాలోకి ట్రాన్స్ ఫామ్ చేసాడు. ఇంత పెద్ద సినిమాకి కావాల్సిన, ఉండాల్సిన వైబ్రేటింగ్ ఆర్.ఆర్ ని అందించాడు. కానీ పాటలు మాత్రం సూపర్ అని చెప్పుకునేలా లేవు. రెండు పాటలు మాత్రం విజువల్స్ పరంగా ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ లో లేపెయ్యడానికి చాలా వేస్ట్ కంటెంట్ ఉంది.

సినిమా గురించి: ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రేంజ్ హైప్ తో, పాన్ ఇండియా ఇమేజ్ తో, ప్రభాస్ రేంజ్ ని తెలిపే సినిమాగా వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సాహో సుజీత్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే వల్ల చాలా సఫర్ అయ్యింది. ఒక్క సినిమా అనుభవం ఉన్న కుర్రాడు అన్న భయం నిజం అవడంతో క్లయిమాక్స్ కి చేరడానికి ఆపసోపాలు పడింది. ఇది కేక అని ప్రభాస్ ఫ్యాన్స్ ఫీల్ అయ్యే మూమెంట్స్ కూడా పెద్దగా లేవు. మరి ఇన్ని అడ్డకుంలు దాటుకుని కేవలం ముందు నుండి నమ్ముకున్న హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్సెస్ తో సాహో ఎంతవరకు రాబడుతుంది? ఏ రేంజ్ సినిమాగా మిగులుతుంది అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చెయ్యాలి.

చివరిగా: సాహో సినిమా పైన పటారం లోన లొటారం అన్న చందంగా తీసారు. సినిమా అంత ఒకే ఒక్కడుగా సాగిందనే టాక్ ఉంది. బాహుబలి సినిమాతో వచ్చిన ఇమేజ్ను ప్రభాస్ పూర్తిగా డామెజ్ చేసుకున్నాడని చెప్పవచు. దర్శకుడు సుజిత్ మాత్రం ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించడానికి అనుభవం ఎంతైనా అవసరమని గ్రహించక తప్పదు. మొత్తానికి ఈసినిమాతో టాలీవుడ్ రేంజ్ను మరోమారు దిగజార్చారని చెప్పక తప్పదు.

రేటింగ్. 2.25/5

Share.