రాక్షసుడు మూవీ రివ్యూ & రేటింగ్

Google+ Pinterest LinkedIn Tumblr +

సినిమా: రాక్షసుడు

నటీనటులు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్, రాజీవ్ కనకాల, రాధా రవి.

దర్శకుడు : రమేష్ వర్మ

సంగీతం : జీబ్రాన్

నిర్మాణ సంస్థలు : ఏ స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్.

నిర్మాత : కోనేరు సత్యనారాయణ

సినిమా నిడివి : 149 నిమిషాలు

విడుదల తేది : 2 ఆగస్టు 2019

యంగ్హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, టాలీవుడ్ ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా రాక్షసుడు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకుగా తెరకు పరిచయం అయినా తన స్టామినాతో ఢిపరెంట్ కథలను ఎంచుకుంటూ హీరోగా ఫ్రూవ్ చేసుకుంటున్నాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్కు ఇప్పుడు ఈ సినిమా హిట్ కావడం ఎంతో అవసరం. ఇక అనుపమ పరమేశ్వరన్ ఇప్పటికే టాలీవుడ్లో తన గ్లామర్ పాత్రలతో అందరిని మెప్పించింది. అయితే రాక్షసుడు సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో జత కట్టింది అనుపమా పరమేశ్వరన్. తమిళంలో వచ్చిన రాచ్చసన్ అనే సినిమాకు ఈ సినిమా రీమేక్. ఈసినిమాకు అచ్చుగుద్దినట్టుగానే ఉంది. ఓ క్రైంథ్రిల్లర్ సినిమాగా వరుస హత్యల నేపధ్యంలో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు రమేష్ వర్మ పెన్మత్స. కోనేరు సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమా ఎలా ఉందో ఓ సారి లుక్కేద్దాం.

కథమిటంటే…

చదువుకునే అమ్మాయిలే లక్ష్యంగా ఎంచుకుని కిడ్నాప్ చేస్తుంటాడు విలన్. కిడ్నాప్ చేసిన వారిని అతి కిరాతంగా హతమార్చుతుంటాడు. ఎవరికి అంతుచిక్కని ఈ కిడ్నాప్, హత్యల సీరియల్ హంతకుడిని పట్టుకునేందుకు పోలీసాఫీసర్గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రయత్నిస్తుంటాడు. ఇందులో హీరో మేనకోడలు కూడా కిడ్నాప్ అయి హత్యకు గురవుతుంది. అనుపమా పరమేశ్వరన్ ఓ టీచర్గా పనిచేస్తుంది. ఈ స్కూల్ అమ్మాయి కూడా కిడ్నాప్ కావడం, హీరోయిన్తో హీరో కేసుపై ఇన్వేస్టిగేషన్తో కలుసుకోవడం ఇద్దరి మద్య ప్రేమ చిగురించడటం, కిడ్నాప్, హత్యలు చేస్తున్న క్రిమినల్ను పట్టుకోవడం చివరికి ఎలా మలుపు తిరిగింది అనేది ఈ సినిమాను తెరపై చూడాల్సిందే..

సినిమా ఎలా ఉంది…

దర్శకుడు రమేష్ వర్మ ఈ సినిమాను రూపొందించిన తీరు అద్భుతంగా ఉంది. సినిమాను పొడిగించకుండా కేవలం 149 నిమిషాల్లోనే సినిమాను ముగించేసాడు. అయితే సినిమా చూస్తున్న సేపు ఇంకా ఏమి జరుగుతుందో అనే ఉత్కంఠ కలిగించింది. ఇక దర్శకుడు ఎంచుకున్న కథ యధార్థమే అయినప్పటికి తీసిన తీరు అత్యద్భుతంగా తెరకెక్కించాడు. తమిళ మాతృక కథ దెబ్బతినకుండా దర్శకుడు రమేష్ వర్మ బాగానే తిప్పలు పడ్డాడనిపిస్తుంది. కిడ్నాప్, హత్యలు, పోలీసుల ఇన్వేస్టిగేషన్, కిడ్నాప్ కు గురైన పిల్లల కుటుంబ సభ్యులు పడుతున్న బాధలు, మధ్య మధ్యలో హీరోయిన్తో హీరో సాగించిన ప్రేమాయణం, సంధర్భోచితంగా వచ్చిన పాటలు ప్రేక్షకులను ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా కథలో లీనమయ్యేలా తీసాడు. సినిమా ఎక్కడ బోరు కొట్టకుండా దర్శకుడు తన ప్రతిభను చూపాడు. ఫస్ట్ హాప్ అంతా ఉత్కంఠగా సాగిన సినిమా సెకండాఫ్ అంతా ఉరుకులు పరుగుల మీద నడిచింది.

నటినటుల ఫెర్ఫార్మెన్స్…

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఓ పోలీసాఫీసర్గా రెండోసారి తన ఫెర్ఫార్మెన్స్ను చూపాడు. తమిళ వెర్షన్లో వచ్చిన రాక్షసన్ సినిమాలో లీడ్ పాత్ర పోషించిన విష్ణు విశాల్ నటించిన తీరుగానే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించి మెప్పించాడు. చిత్రంలో తన క్యారెక్టర్ తగ్గట్టుగానే పాత్రలో లీనమైన బెల్లంకొండ తన నటనలో పరిపక్వతను చూపాడు. బెల్లంకొండ తన కేరీర్లోనే బెస్ట్ నటనను ఈ సినిమాలో చూపాడు. ఇక సాయి శ్రీనివాస్ జోడిగా నటించిన అనుపమ పరమేశ్వరన్ తన గ్లామర్ పాత్రకు తగిన విధంగానే న్యాయం చేసిందని చెప్పొచ్చు. ఓ టీచర్గా స్కూల్ పాప కిడ్నాప్ అయితే పడే ఆవేధనలో ఆమే చేసిన అభినయం అద్భుతంగా ఉందని ప్రేక్షకులు అంటున్నారు. ఇక రాజీవ్ కనకాల, రాధా రవిలు తమ శక్తి మేరకు నటించాడు.. మొత్తానికి సినిమాలో నటీనటులు తమ పాత్రలకు తగిన విధంగా నటించిన మెప్పించారనే చెప్పొచ్చు.

తెరవెనుక పనితీరు…

తెరవెనుక సాంకేతిక నిపుణులు తమశక్తి మేరకు పనిచేశారనే చెప్పోచ్చు. సంగీత దర్శకుడు జిబ్రాన్ తన ప్రతిభను చూపాడు. సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఇక సినిమా మొత్తానికి సంగీతం ఓ ప్లస్ పాయింట్గానే మిగిలిపోతుంది. ఇక దర్శకుడు రమేష్ వర్మ తన ప్రతిభకు కొలమానంగా ఈ సినిమా నిలుస్తుంది. ఈ సినిమాలో ఎక్కడ కూడా అతిగా పోలేదని చెప్పొచ్చు. ఇక ప్రేక్షకులు థియోటర్ నుంచి బయటకు రాలేని పరిస్థితిని తీసుకొచ్చాడు. ఈసినిమా యధార్థగాథను హృదయాలకు హత్తుకునేలా, సన్నివేశాలు ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు. ఇక నిర్మాత కోనేర సత్యనారాయణ నిర్మాణంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదని ఈ సినిమా తెలుపుతుంది. సో మొత్తానికి ఈ సినిమా సాంకేతిక బృందం పనితీరుకు ఫిదా కావాల్సిందే…

చివరిగా చెప్పొచ్చేమంటే…

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కేరీర్లో ఈసినిమా బెస్ట్ మూవీగా నిలిచిపోతుంది. ఓ యథార్థకథను తెరకెక్కించి సమాజంలో ఇలాంటి సంఘటనలకు పాల్పడితే కుటుంబాలు ఎలా అవుతాయో అనే సందేశం, ఇక ఇలాంటి సంఘటనలకు పాల్పడేవారికి చివరికి ఏ గతి పడుతుందో ఓ గుణపాఠం నేర్పినట్లే.. ఈ సినిమా అటు హీరో సాయి శ్రీనివాస్కు ఇటు దర్శకుడు రమేష్ వర్మకు కేరీర్కు బాగా ఉపయోగపడే సినిమా.

రివ్యూ & రేటింగ్ : 2.75

Share.