బ్రెయిన్ పవర్ ని పెంచే బంగాళాదుంప

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రపంచంలో ఏ జీవికి లేని మెదడు పరిమాణం ఒక్క మనిషికి మాత్రమే ఉంది. దానికి ప్రధాన కారణం మనం తినే పిండి పదార్ధాలే అని ఇటీవలే ఒక పరిశోధనలో తేలింది. మనిషి మెదడు అభివృద్ధి కి కార్బోహైడ్రేట్స్ దే ప్రధాన పాత్రని బార్సిలోనా విశ్వవిద్యాలయానికి చెందిన వైద్యులు చెబుతున్నారు.వెనుకటి కాలంలో బంగా ళాదుంపలు, గింజలు, పండ్ల ద్వారా అధికంగా ఈ పోషకాలు లభించేవని వైద్యుల పరిశోధనలో తేలిందట. రక్తంలోని 60 శతం గ్లూకోజ్ ని, శరీరం లోని 25 శాతం శక్తిని మన మెదడు వాడుకుంటుంది.కావునా తక్కువ కార్బోహైడ్రాట్స్ ఉన్న ఆహార పదార్ధాలని మనం తీసుకుంటే మన బ్రెయిన్ తగినంత గ్లూకోజ్ అందదు. అందువలన పిండి పదార్ధాలని మరియు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే మన మెదడు పనితీరు చురుగ్గా మరియు వేగవంతంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

Share.