రవితేజ..ఖిలడీ మూవీ లిరికల్ సాంగ్ అదుర్స్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

హీరో రవితేజ ఈ ఏడాది క్రాక్ సినిమాతో మంచి సక్సెస్ను అందుకున్నాడు. ఇక ఈ సినిమాతోనే ప్రేక్షకులు థియేటర్ల బాటపట్టారు అని చెప్పవచ్చు. ఇక దాంతో ఈ సినిమా కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ దగ్గర అదరకొట్టింది. ఇక ఈ సినిమా రవితేజ కెరీర్ లోనే ఒక బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక డైరెక్టర్ గోపీచంద్ మలినేని రవితేజతో కలిసి బలుపు, డాన్ శీను, క్రాక్ వంటి సినిమాలతో హ్యాట్రిక్ కొట్టారు. ఇప్పుడు తాజాగా రవితేజ రమేష్ వర్మ డైరెక్షన్ లో. ఖీలాడి సినిమాని తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా నుంచి ఇప్పటివరకు టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇందులో ముఖ్యమైన పాత్రలో అనసూయ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఇప్పుడు మూడో పాట లిరికల్ వీడియో ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

Share.