పుష్ప సినిమా నుంచి అదిరిపోయే సీన్ డిలీట్ చేసిన మేకర్స్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ సినిమాలో హీరోగా అల్లు అర్జున్ హీరోయిన్ గా రష్మిక మందన్న నటించారు.. ఇకపోతే ఈ సినిమా స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కి మంచి విజయాన్ని అందుకుంది. సాధారణంగా సినిమా నిడివి ఎక్కువ అయినప్పుడు అందులో కొన్ని సన్నివేశాలను ఎడిటింగ్లో తీసేస్తారు అన్న విషయం తెలిసిందే. అయితే అలా ఎడిటింగ్ లో తీసేసిన సన్నివేశాలు కొన్ని చాలా బాగుంటాయి..మరికొన్ని చెత్తగా ఉంటాయి.. అయితే.. ఈ సినిమాలో ఒక మంచి కామెడీ ఉన్న సన్నివేశాన్ని ఎడిటింగ్ నుంచి తీసేశారట.

మైత్రి మూవీ మేకర్స్ మరియు ముత్తంశెట్టి మీడియా లు సంయుక్తంగా ఈ సినిమా ను నిర్మించడం జరిగింది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం లో హీరోయిన్ గా రష్మీక మందన్న నటించగా, సునీల్, అనసూయ భరద్వాజ్, ఫాహద్ ఫజిల్, ధనంజయ లు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఇప్పటికే థియేటర్ల లో విడుదల అయ్యి పాజిటివ్ టాక్ తో దూసుకు పోతుంది. ఈ చిత్రం విడుదల అయిన అన్ని చోట్ల భారీ వసూళ్లను రాబడుతోంది. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ఒక వీడియో ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రం నుండి డిలీట్ చేసిన ఒక వీడియో ను చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదిక గా షేర్ చేయడం జరిగింది. ఈ వీడియో సైతం ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Share.