న్యూ ఇయర్ స్పెషల్..బోళా శంకర్ అప్డేట్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం బోళా శంకర్. తాజా సినిమా నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు చిత్ర యూనిట్ సభ్యులు. ఈ సినిమా తమిళం నుంచి వేదాళం మూవీకి రీమేక్ గా ఈ సినిమాలో చిరంజీవి నటిస్తున్నాడు. ఇందులో చిరంజీవి చెల్లెలుగా కీలక పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నది. ఇందులో కథానాయికగా తమన్నా నటిస్తోంది. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ భర్త పాత్రలో నాగశౌర్య నటించబోతున్నట్లు గా సమాచారం.

ఇక ఈ మూవీకి మణిశర్మ కుమారుడు సర్వ సాగర్ సంగీతం అందిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి పూల స్వాగ్ అంటూ రేపు న్యూ ఇయర్ సందర్భంగా ఉదయం 9 గంటలకు అప్డేట్ ను విడుదల చేయబోతున్నారు. ఇక ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమాలో నడుస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నది. త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇక ఇందులో చిరంజీవి కుమారుడైన రామ్ చరణ్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నాడు. ఏది ఏమైనా చిరంజీవి వరుస సినిమాలతో చాలా బిజీగా అయ్యాడని చెప్పవచ్చు.

Share.