బంగార్రాజు మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఆనందంలో ఫ్యాన్స్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నాగార్జున, నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం బంగార్రాజు. ఇప్పటికే ఈ సినిమా మా కి సంబంధించి నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా టీజర్ను విడుదల చేయడం వల్ల మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ టీజర్ లో చిన్న బంగార్రాజు గా నాగచైతన్య అదరగొట్టాడు అని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా ఈ సినిమా విడుదల తేదీపై ఇప్పటివరకు క్లారిటీగా ఏ విషయం తెలియడం లేదు. సంక్రాంతి పండుగ విడుదల చేయాలని చూసిన ప్రమోషన్లలో చాలా వెనుకబడి ఉండడం తో ఈ సినిమా విడుదల అవుతుందా లేదా అని అక్కినేని అభిమానులు ఆలోచిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రోమో పాటలు, వీడియోలు మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను రేపు న్యూ ఇయర్ కానుకగా.. ఉదయం 11:22 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది. అయితే సంక్రాంతికి పెద్ద సినిమాలు విడుదల అవుతుండటంతో ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు గా సమాచారం.

Share.