100 కోట్ల రెమ్యూనరేషన్ పై రామ్ చరణ్ ఏమన్నాడంటే..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగాస్టార్ చిరంజీవి కుమారుడు సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో సంవత్సరాలు కావస్తోంది. ఎన్నో సినిమాల్లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటిస్తూ తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో.. RRR సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఇక అంతే కాకుండా ఆచార్య సినిమాలో తండ్రి కొడుకులు కూడా కలిసి నటించారు. ఇక ఆ సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు రామ్ చరణ్.

ఇదిలా ఉంటే గత కొద్దిరోజుల నుంచి రామ్ చరణ్ తను నటించబోయే తర్వాతి సినిమాకి..100 కోట్ల రూపాయలను రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.RRR సినిమా ప్రమోషన్ లో భాగంగా రామ్ చరణ్ రెమ్యూనరేషన్ విషయంలో ఒక ప్రశ్న అడిగారట.. ఇక ఈ వంద కోట్ల విషయంలో అవన్నీ రూమర్స్ అని కొట్టిపారేసారు రామ్ చరణ్. రామ్ చరణ్ 100 కోట్లు నాకు ఎవరు ఇస్తున్నారని. అసలు నాకు ఎవరు ఇవ్వలేదని తెలియజేశాడు రామ్ చరణ్. దీన్నిబట్టి రామ్ చరణ్ వంద కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని వార్త పై ఒక క్లారిటీ వచ్చిందని చెప్పవచ్చు.

Share.