స్పెషల్ సాంగ్ షూట్ లో పాల్గొన్న మాస్ మహారాజా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మొన్నటి వరకు మాస్ మహారాజ గా గుర్తింపు తెచ్చుకున్న రవితేజ ప్రస్తుతం లవబుల్, ఎనర్జిటిక్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. నిజం చెప్పాలంటే మాస్ ప్రెజెంట్ చేయడంలో రవితేజకు సాటి మరొకరు లేరని చెప్పాలి. ఇకపోతే ఈ ఏడాది ఈయన నటించిన క్రాక్ సినిమాతో మాసివ్ హిట్ అందుకున్న మాస్ మహారాజా తాజాగా ఖిలాడి సినిమాతో సాలిడ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేసి త్వరలోనే రిలీజ్ కు సిద్ధమవుతున్నాడు.

అయితే ఇక్కడ ఊహించని విధంగా కరోనా సెకండ్ వేవ్ మొదలు కావడంతో సినిమా ఆగిపోయింది. రెండోసారి షూటింగ్ లో బిజీగా ఉన్నా.. మరో మాస్ సాంగ్ ని షూట్ చేస్తున్నట్లుగా క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఇకపోతే నేరుగా సాంగ్ షూట్ నుంచే హీరోయిన్ డింపుల్ హాయతి, రవితేజ వీరితోపాటు సాంగ్ డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ కూడా మనకు ఈ ఫోటోలో కనిపిస్తున్నారు. హీరోయిన్ డ్రెస్సింగ్ అంతా చూస్తుంటే ఈ సాంగ్ పక్కా..నాటుగా.. మాస్ గా ఉంటుంది అని అర్థమవుతోంది. దేవి శ్రీ ప్రసాద్ ఎలాంటి ట్యూన్ అందించాడో..అందుకు తగ్గట్టుగా రవితేజ ఎలాంటి స్టెప్స్ వేశారో తెలియాలి అంటే మరి కొన్ని రోజులపాటు ఆగాల్సిందే.

Share.