రేసులో స్పీడ్ పెంచిన చిట్టి.. అవకాశాలు అందుకున్నట్టేనా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

జాతి రత్నాలు సినిమాతో అందరిని అలరించిన చిట్టి అలియాస్ ఫరియా అబ్దుల్లా.. మొదటి సినిమాతోనే మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ తన హైట్ తనకు శాపంగా మారిందని చెప్పవచ్చు. ఈమె హైట్ కి తగ్గ టు హీరోలు కావాలి అంటే అది కేవలం ప్రభాస్, మహేష్ బాబు, రానా వంటి వారితో మాత్రమే సాధ్యమని సమాచారం. 5 అడుగుల 10 అంగుళాల పొడవున్న చిట్టి కోసం హీరోలు ఎవరూ దొరకడం లేదు. అందుకే ఈమె సినీ ఇండస్ట్రీ కి దూరంగా ఉంటూ వస్తోంది. అయితే తాజాగా బంగార్రాజు సినిమాల్లో ఐటం సాంగులో మెరిసి అందర్నీ మరోసారి పలకరించింది. ఈ పాటలో అటు నాగార్జున ఇటు నాగచైతన్యతో కలిసి స్టెప్పులేసిన చిట్టి ఓవర్ నైట్ లోనే మంచి అవకాశాలను సంపాదించుకుంటోంది.

అయితే ఇప్పుడు సంతోష్ శోభన్‌తో కలసి నటించబోతోంది. మేర్లపాక గాంధీ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తనది చిట్టి కంటే స్ట్రాంగ్ రోల్ అని, యూత్‌కి కచ్చితంగా కనెక్ట్ అవుతుందని ఫరియా అంటోంది. ఇక రవితేజ హీరోగా రూపొందుతున్న ‘రావణాసుర’లోనూ ఫరియా నటించనుందని టాక్. ప్రియాంక అరుళ్ మోహన్ ఫిమేల్​ లీడ్​గా నటిస్తున్న ఈ చిత్రంలో ఫరియా సెకెండ్ హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోందట. ఏది ఏమైనా మళ్ళీ సినిమా అవకాశాలు దక్కించుకుంటూ రేస్ లో స్పీడ్ పెంచుతోంది చిట్టి.

Share.