రామారావు అన్ డ్యూటీ మూవీ పై లేటెస్ట్ అప్డేట్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

రవితేజ ఈ ఏడాది వరుస పెట్టి సినిమాలు తీస్తున్నాడు..రవితేజ హీరోగా, శరత్ మండవ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం రామారావు ఆన్ డ్యూటీ.. ఈ సినిమాని శ్రీలక్ష్మీవెంకటేశ్వర సినిమాస్ మరియు ఆర్ట్ టీమ్ వర్క్ పతాకంపై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే పలు పోస్టర్లు విడుదల అయ్యి ప్రేక్షకులను అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ ను చిత్ర యూనిట్ సభ్యులు సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ ను త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. అంతేకాకుండా వచ్చే ఏడాది 2022 లో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉంటే.. అంతేకాక భవిష్యత్తు మొత్తం అలాగే ఉండాలని కోరుకుంటూ డైరెక్టర్ శరత్ మండువ సోషల్ మీడియా వేదిక తెలియజేయడం జరిగింది. ఇక ఈ సినిమాలు దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్ పాత్రలో నటిస్తుండగా, సామ్ సి. ఎస్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుతం ఈ ట్విట్టర్ వైరల్ గా మారుతోంది.

Share.