హీరో..నాని సరి కొత్త సినిమా.. పోస్టర్ వైరల్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

హీరో నాచురల్ స్టార్ నాని ఈ ఏడాది విడుదలైన రెండు సినిమాల్లో కూడా మంచి ఆదరణ పొందాయి. మతి తాజాగా విడుదలైన శ్యామ్ సింగ రాయ్ సినిమా మంచి సక్సెస్ తో దూసుకుపోతోంది. అంతేకాకుండా నాని కెరీర్లోనే బెస్ట్ గా ఈ సినిమా నిలిచిందని చెప్పవచ్చు. ఇక నాని తన తరువాత సినిమా ప్రాజెక్టు ఏమిటంటే..”అంటే సుందరానికి”నుంచి ఆశక్తికరమైన అప్డేట్ ని మేకర్ ఈరోజు విడుదల చేయడం జరిగింది.

డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి నాని ఫస్ట్ లుక్ పోస్టర్ ని కాదు జీరోత్ లుక్ అంటూ వినూత్న అప్డేట్ ను అందించారు. ఈ జీరోత్ లుక్ ను కొత్త సంవత్సరం 1న అద్భుతంగా సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విలువ చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు. అలాగే ఇందులో నాని చేస్తున్న పాత్ర సుందరం అనే పేరుని కూడా తెలియజేశారు. మరి ఈ లుక్ లో నాని ఇంకెంత కొత్తగా కనిపిస్తాడు అంటూ ఆయన అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో నాని సరసన నజ్రియా నటిస్తోంది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

Share.