ఎంతో అద్భుతంగా.. కొనసాగుతున్న ఒకే ఒక జీవితం టీజర్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

హీరో శర్వానంద్.. శ్రీ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఓకే ఒక జీవితం. ఈ సినిమాకి సంబంధించి టీజర్ ఈ రోజున కొద్ది నిమిషాల ముందు విడుదలైంది. ఈ సినిమా సైన్స్ ఫీక్షన్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా రీతూవర్మ నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి టీజర్ విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఈ సినిమా టీజర్ ఎంతో అద్భుతంగా, ఆసక్తికరంగా ఉండడం వల్ల ఈసారి శర్వానంద్ ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తాడా అని ఆయన అభిమానులు అనుకుంటున్నారు.ఇక అంతేకాకుండా టైమ్ మిషన్ కాన్సెప్టుతో.. ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. అందుచేతనే ఈ సినిమాపై చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇక ఈ సినిమాలో నాగార్జున భార్య అమల కూడా నటించడం విశేషం.

ఇక ఈ సినిమాలో సరికొత్త గా గిటారిస్ట్ గా కనిపించబోతున్నాడు. ఇక కమెడియన్ వెన్నెల కిషోర్, ప్రియదర్శని నటిస్తున్నారు. ఈ మూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ తమిళ్ లో కూడా కణం పేరిట విడుదల కానుంది.

Share.