ఆది తీస్ మార్ ఖాన్..మూవీ నుండి వీడియో వైరల్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

హీరో ఆది సాయి కుమార్, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం తీస్ మార్ ఖాన్.. ఇక ఈ సినిమా ఒక హై యాక్షన్ చిత్రంగా నిర్మించబడుతోంది. ఈ సినిమాకి డైరెక్టర్ గా కళ్యాణ్ జీ గోగాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కమెడియన్ సునీల్ కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో చాలా బిజీగా ఉన్నది.

ఇక ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్ల పై ఫోకస్ పెట్టిన దర్శకనిర్మాతలు.. తాజాగా ఒక వీడియోని విడుదల చేయడం జరిగింది. ఇక ఈ వీడియోలో స్టూడెంట్ గా, రౌడీగా, పోలీస్ ఆఫీసర్ గా ఆది సాయి కుమార్ మూడు షెడ్యూల్స్ లో కనిపించారు.ప్రేక్షకుల నుంచి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది ఈ వీడియోకు.. ఇప్పటివరకు 700 k పల్స్ డిజిటల్ వ్యూస్ వచ్చాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాని కి బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, మణికాంత్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా వీడియో వైరల్ గా మారుతోంది.

Share.