30 ఏళ్లు గా చిరుకి డూప్ గా నటించేది ఇతడే..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగాస్టార్ చిరంజీవి 60 సంవత్సరాలు పైబడిన సినీ ఇండస్ట్రీలో కొత్త హీరోలతో పోటీ గా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కొన్ని క్లిష్టతరమైన పాత్రలు చేసేటప్పుడు హీరోలకైనా.. హీరోయిన్లకైనా డూప్స్ ఉంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే. అలా క్లిష్టమైన సన్నివేశాలను చిత్రీకరించినప్పుడు కొన్ని షాట్లలో డూప్ లతో చేయిస్తూ ఉంటారు దర్శకనిర్మాతలు. ఇకపోతే సోషల్ మీడియా హవా పెరిగిన తర్వాత ప్రతి చిన్న విషయాన్ని యూట్యూబ్ ఛానల్స్ వారు వెతికి పెట్టి మరీ వారితో ఇంటర్వ్యూలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే చిరంజీవికి గత ముప్పై సంవత్సరాలుగా డూపు గా పనిచేస్తున్న వ్యక్తి గురించి తెలుసుకొని ఆయనను ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మార్టూరు అనే గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్ గత 30 సంవత్సరాలుగా చిరంజీవికి డూపుగా పని చేస్తున్నారట. ఈ ప్రేమ్ కుమార్ కు రికార్డింగ్ డాన్స్ అనే పేరుతో ఒక కంపెనీ కూడా ఉంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అయిన రికార్డింగ్ డాన్సు అంటే చాలా మందికి చిన్నచూపు కానీ 30 ఏళ్లుగా నేను చిరు గారికి డూప్ గా పనిచేస్తున్నాను..ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను అని ఆయన తెలిపాడు.

Share.