నరేంద్ర మోడీతో.. భేటీ అయిన మెగా కోడలు.. కారణం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగా ఫ్యామిలిలో కోడలు ఉపాసనకి ప్రత్యేక స్థానం ఉందని చెప్పవచ్చు. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ గారి తో మర్యాద పూర్వకంగా భేటీ అయింది ఉపాసన. ఉపాసన ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేసింది. నరేంద్ర మోడీ ని కలవడం ఎంతో ఎగ్జైటింగ్ గా ఉంది అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది ఉపాసన.

అపోలో ఫౌండేషన్ వైస్ చైర్మన్ పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇండియన్ ఎక్స్ పో 2020లో భాగం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమైనట్టు ఆమె తెలిపింది. ఈ సమావేశానికి సంబంధించి ప్రధానమంత్రి తో దిగిన ఒక ఫోటో ఆమె అభిమానులతో షేర్ చేసుకుంది. అంతేకాదు దీనికి సంబంధించిన ఇతర విషయాలను సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసుకున్నారు. నరేంద్ర మోడీ యానిమేషన్ తో కూడిన యోగాసనాలకు సంబంధించిన వీడియోను కూడా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. చిరంజీవి కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసన ప్రధానమంత్రితో భేటీ కావడం విశేషం సంతరించుకుంది. ఇకపోతే వీరిద్దరి మధ్య లో త్వరలో విడుదల కానున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం.

Share.