హీరో ధనుష్ మొదటిసారిగా తెలుగులో డైరెక్ట్ సినిమా ఇదేనట..!

Google+ Pinterest LinkedIn Tumblr +

హీరో ధనుష్ విభిన్నమైన కథ ఎప్పుడు ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఇక ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ కాసింత అహంకారం కూడా లేకుండా సింపుల్గా ఉంటాడు ధనుష్.సౌత్ ఇండియన్ సినిమా దగ్గర పలువురు వెర్సిటైల్ హీరోల జాబితాలో టాలెంటెడ్ హీరో ధనుష్ పేరు కూడా ఖచ్చితంగా నిలుస్తుంది. ఎలాంటి పాత్రలో అయినా కూడా ఇమిడిపోయే ధనుష్ మొదటిసారిగా టాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. మరి ఈరోజు ఆ సినిమా అనౌన్సమెంట్ ని ఈరోజు మేకర్స్ అందించారు.

ఆసక్తికర మోషన్ టీజర్ తో ఈ సినిమాకి “సార్” అనే టైటిల్ ని రివీల్ చేశారు. అలాగే తమిళ్ లో కూడా ఈ చిత్రాన్ని “వాతి” అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేసారు. అలాగే ఇందులోనే ఈ సినిమా లో కంటెంట్ కూడా ఎంత స్ట్రాంగ్ గా ఉండబోతుందో అనేది కూడా రివీల్ చేసే ప్రయత్నం చేశారు.

ఇది మాత్రం చాలా ఆసక్తిని రేపుతోంది. ఇక ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా నాగవంశీ మరియు సాయి సౌజన్య లు నిర్మాతలుగా తెరకెక్కిస్తున్నారు. అలానే టాలెంటడ్ సంగీత దర్శకుడు జి వి ప్రకాష్ సంగీతం అందివ్వనున్నాడు.ఇక ఎన్నో రోజులుగా ధనుష్ అభిమానులు తెలుగులో డైరెక్ట్ గా ఒక సినిమా చేస్తారని ఎదురు చూసిన వారికి ఒక గుడ్ న్యూస్ లాంటిదని చెప్పవచ్చు.

Share.