తెలుగు ఇండస్ట్రీ లోనే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్న శివాని రాజశేఖర్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

యాంగ్రీ మ్యాన్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ హీరో రాజశేఖర్ సినిమాల్లో ఉండే ఆసక్తి కారణంగా తన వైద్య వృత్తిని కూడా పక్కనపెట్టి ఆయన యాక్టర్ అయ్యాడు. ఇక ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తరువాత జీవితారాజశేఖర్ ను వివాహం చేసుకొని ,రాజకీయాలలో కూడా తమ వంతుగా పని చేస్తున్నారు. శివాని రాజశేఖర్ , శివాత్మిక రాజశేఖర్ ఇద్దరూ కూడా ఇండస్ట్రీలో హీరోయిన్లు గా ఇప్పుడిప్పుడే అడుగుపెట్టి మంచి మంచి సినిమా కథలను ఎంచుకుంటున్నారు.

ఇకపోతే తాజాగా శివానీ రాజశేఖర్ తెలుగు సినీ ఇండస్ట్రీలోని మొట్టమొదటిసారి అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది.హీరో కళ్యాణ్ రామ్ తో కలిసి..118 మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ కె.వి.గుహన్. సినిమాటోగ్రాఫర్ గా మొదటి చిత్రంతోనే మంచి సక్సెస్ ను అందుకున్నాడు ఈ డైరెక్టర్. అయితే ఇతను డైరెక్షన్లో.. మొదటిసారిగా ఒక కంప్యూటర్ స్క్రీన్ తో మొత్తం మూవీని తెరకెక్కించడం జరుగుతోంది.. అదే..WWW (WHO WHERE WHY) ఇక ఇందులో కథానాయకులుగా శివాని రాజశేఖర్, ఆదిత్ అరుణ్ నటిస్తున్నారు. ఈ మూవీ ని రామ మంత్ర క్రియేషన్ బ్యానర్ పై రవి పి రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ వంటి విడుదలయ్యాయి. ప్రేక్షకులను బాగానే అలరించాలి అని చెప్పవచ్చు.

సినిమా థియేటర్ లో కాకుండా డైరెక్ట్ గా నే ఓటిటీలో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు. ఈ నెల 24న సోనీ లైవ్ లో.. విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించడం జరిగింది.

Share.