ఎన్టీఆర్ – రామ్ చరణ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సల్మాన్ ఖాన్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు కలిసి నటిస్తున్న తొలి సినిమా ఆర్ ఆర్ ఆర్ . సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో సినిమా యూనిట్ సభ్యులు శరవేగంగా పాల్గొంటున్నారు. విజువల్ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెట్టుకోవడం గమనార్హం. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ స్టేజ్ ను ముంబైలో ఏర్పాటు చేసి ఘనంగా ఈవెంట్ ను నిర్వహించారు.. ముఖ్యంగా వెలుగు జిలుగుల కాంతిలో క్రేన్ తో అమర్చిన స్పెషల్ వెహికల్ తో సల్మాన్ ఎంట్రీ ఇవ్వడం సూపర్ గా వుంది.

Salman Khan announces Bajrangi Bhaijaan 2, calls Ram Charan 'most  hardworking' actor | Entertainment News,The Indian Express

ఇకపోతే సల్మాన్ ఖాన్ ఈ సినిమా చిత్ర బృందం పై తనదైన శైలిలో వ్యాఖ్యానిస్తూ ప్రశంసల వర్షం కురిపించాడు . ఈ క్రమంలోని ఎన్టీఆర్, రామ్ చరణ్ ల గురించి కూడా ఎవరికి తెలియని విషయాలు తెలిపి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ నటన నాకు చాలా ఇష్టం. ఆయన నటన కోసమే నేను సినిమాలు చూస్తాను. ఇక రామ్ చరణ్ కూడా చాలా గొప్ప నటుడు .రామ్ చరణ్ లా హార్డ్ వర్కింగ్ చేసే నటుణ్ని ఇప్పటివరకు నేను చూడలేదు.. ఇక ఈ సినిమా కోసం ఇండియా మొత్తం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇక ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధిస్తుంది. అంతేకాదు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మరో నాలుగు నెలల పాటు ఏ సినిమా కూడా రిలీజ్ కాకుండా వుంటే చాలా బాగుంటుంది అంటూ సల్మాన్ ఖాన్ కామెంట్ చేశాడు .

Share.