పుష్ప సినిమాలో నటించిన కేశవ ఎవరో తెలుసా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

పుష్ప సినిమాలో పుష్ప రాజ్ పక్కన అసిస్టెంట్ గా ఉంటూ మొత్తం బన్నీ తర్వాత అంత స్కోప్ ఉన్న పాత్ర చేసాడు కేశవ. ఈయన రాయలసీమ యాసను దించేశారని చెప్పవచ్చు. అయితే పుష్పా సినిమాలో కేశవ పాత్ర మంచి స్కోప్ ఉన్న పాత్ర అని చెప్పవచ్చు. ఫస్ట్ హాఫ్ మొత్తం అతని కామెడీ ప్రేక్షకులను మెప్పించింది. బన్నీ పక్కనే ఉంటూ అందరినీ మెప్పించిన ఈ నటుడి పేరు జగదీష్ ప్రతాప్ బండారి. ఇతను చిన్న సినిమాల్లో నటించాడు. ఆహా వెబ్ సిరీస్ కొత్త పోరడు లో కూడా నటించాడు. ఆ తర్వాత జార్జిరెడ్డి ,పలాస 1978, మల్లేశం, పిక్ పాకెట్ వంటి సినిమాలలో నటించాడు. ఎన్ని సినిమాలు నటించినా ఆయనకు పెద్దగా గుర్తింపు రాలేదనే చెప్పాలి . కానీ పుష్ప సినిమాతో ఒక్కసారిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు..


పుష్ప ది రైజ్ లోనే కాదు పార్ట్ 2 ది రూల్ లో కూడా అతని పాత్ర చాలా బాగుంటుందని సమాచారం. నటించాలనే తపన ఉండి వచ్చిన ప్రతి అవకాశాన్ని చేసుకుంటూ వెళ్తే ఏదో ఒకరోజు మనకు గొప్ప అవకాశం వస్తుందని మరోసారి జగదీష్ ని చూస్తే అర్ధమవుతుంది. కేశవ పాత్రతో తన ప్రతిభ చాటిన జగదీష్ అందరి దృష్టిలో పడ్డాడు. పుష్ప వల్ల అతనికి చాలా మంచి అవకాశాలు రావడం పక్కా అని చెప్పొచ్చు.

Share.