కరణ్ కు రిటర్న్ గిఫ్ట్ పంపిన రాజమౌళి.. అందులో ఏముందంటే..?

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస విజయాల అనంతరం దర్శకుడు రాజమౌళి బాహుబలి సినిమా తో ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఇకపోతే రాజమౌళి గతంలో తనకు సహాయం చేసిన వారికి వీలైనంత వరకు ఎంతో కొంత హెల్ప్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బాహుబలి సినిమా సక్సెస్ కావడానికి ప్రధాన కారణం సినిమా కథ అయినప్పటికీ.. ఆ సినిమా ఎక్కువ స్థాయిలో కలెక్షన్లు అందుకోవడంలో కీలక పాత్ర పోషించింది మాత్రం కరణ్ జోహార్ అని చెప్పవచ్చు.

Karan Johar On Director Rajamouli - Baahubali Has Beaten The Magic Created By Mughal-e-Azam

అంతే కాదు ఎలాంటి సినిమా చేసినా సరే కరణ్ వీలైనంత వరకు ఎక్కువ ప్రమోషన్ తోనే భారీ స్థాయిలో కలెక్షన్స్ వచ్చేలా ప్రణాళికలు రచిస్తూ ఉంటాడు. బాహుబలి సినిమా విషయంలో కరణ్ జోహార్ రాజమౌళికి చేసిన సహాయాన్ని దృష్టిలో పెట్టుకొని రాజమౌళి కూడా కరణ్ జోహార్ నటించిన బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోట్ చేయడానికి రాజమౌళి బాధ్యతలు తీసుకున్నారు. ఇక ఈ సినిమా 2022 చివర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Share.