వారి కోసం ఎన్నికల ప్రచారానికి సిద్దమవుతున్న కంగనా..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎక్కువగా సమాజంలో జరిగే అన్ని విషయాలపై స్పందిస్తూ ఉంటుంది. అంతేకాదు దర్శకుడు ఆర్జివి లాగా ఈమె ప్రతి విషయంలో తలదూరుస్తూ కొన్ని కొన్ని సార్లు చిక్కులను కోరి తెచ్చుకుంటూ ఉంటుంది. ఈమె ఈ మధ్యకాలంలో ఎక్కువగా రాజకీయ నాయకుల బయోపిక్ లలో నటిస్తూ మంచి పేరు కూడా తెచ్చుకుంటోంది. అయితే తాజా గా ఆ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి సిద్ధమైంది ఈ ముద్దుగుమ్మ.

ఇకపోతే కొన్ని సందర్భాల్లో భాజపాకి మద్దతుగా మాట్లాడటంతో ఆమె ఆ పార్టీలో చేరే అవకాశాలున్నాయని ఊహగానాలు కూడా వినిపించాయి. అయితే, ఈ విషయంపై కంగనా రనౌత్‌ తాజాగా స్పష్టతనిచ్చారు. తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని వెల్లడించారు. శనివారం ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఉన్న శ్రీకృష్ణ జన్మస్థలాన్ని సందర్శించిన ఆమెను పలువురు విలేకరులు యూపీలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో భాజపా తరఫున ప్రచారం చేస్తారా? అని ప్రశ్నించారు. దీనికి కంగనా ”నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు. కానీ, జాతీయవాదుల తరఫున ప్రచారం చేస్తా”అని సమాధానం ఇచ్చారు.

శ్రీకృష్ణ జన్మస్థలంపై కూడా కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందువుల పవిత్రక్షేత్రమైన శ్రీకృష్ణ జన్మస్థలంలో ఈద్గా ఉందని.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ చర్యలు చేపట్టి అసలైన పుణ్యస్థలాన్ని ప్రజలకు చూపిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. తన వ్యాఖ్యలు కొంతమంది మనోభావాలను దెబ్బతీసినా.. నిజాయతీపరులు, ధైర్యవంతులు, జాతీయవాదులు వాస్తవాన్ని గుర్తిస్తారని చెప్పారు.

Share.