ఆర్ఆర్ఆర్ కోసం ఆలియా భట్ తీసుకుంది అన్ని కోట్లా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

రాజమౌళి దర్శకత్వంలో.. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా మల్టీస్టారర్ మూవీ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ కోసం ఏకంగా బాలీవుడ్ నటి ఆలియా భట్ ను తీసుకొచ్చి నటింపజేసిన విషయం తెలిసిందే. మొదటిసారి ఆర్ ఆర్ ఆర్ సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.RRR సినిమా హిందీ ప్రేక్షకులకు కూడా దగ్గరవ్వాలన్న ఉద్దేశ్యంతో అజయ్ దేవగన్, ఆలియా భట్ లాంటి వాళ్ళను సెలెక్ట్ చేసుకున్నారు.

ఈ నేపధ్యంలో తాజాగా బాలీవుడ్ భామ ఆలియా భట్ పాత్ర ఓ ఆసక్తికర కథనం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.అదేంటంటే ఇందులో ఆమె క్యారెక్టర్ 15 నిమిషాలకు మించి ఉండదట. ఈ క్యారెక్టర్‌ చేయడానికి ఆలియా కేవలం 10 కాల్ షీట్లను మాత్రమే కేటాయించి, ఏకంగా రూ.5కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు టాక్. నిజానికి సౌత్ ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ వాళ్లకు చాలా చిన్నచూపు ఉన్నప్పటికీ ఇప్పుడు ఛాన్స్ వస్తే చాలు బాలీవుడ్ భామలు ఠక్కున వాలిపోతున్నారు. అందుకే కథ వినిపించగానే ఒప్పుకున్న ఆలయ బట్ట ఈ సినిమా చేయడం కోసం ఏకంగా 5 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం.

Share.