పుష్ప సినిమా నుంచి సాలిడ్ మేకింగ్ వీడియో..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా టాలీవుడ్ ఆల్ టైం క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం ఇప్పుడు రిలీజ్ కి రెడీ అవుతుండగా..ఇప్పుడు చిత్ర యూనిట్ అంతా కలసి ఆసక్తికర మేకింగ్ వీడియోని రిలీజ్ చేసారు. అయితే ఇందులో మొదటగా బన్నీ గొప్ప పని కోసం మాట్లాడుతూ.. తమ చిత్ర యూనిట్ ఓ ప్రాంతంలో షూట్ చేసినపుడు వారు వాడిన వస్తువులు.. ప్లాస్టిక్ ని అక్కడ డస్ట్ బిన్స్ లో పడేయాలని.. మనం ఇక్కడికి ఎలా అయితే వచ్చామో అలానే తిరిగి వెళ్లాలని వారి స్థలాన్ని క్లీన్ గా ఉంచాలని సూచించాడు.

ఇది నిజంగా తన నుంచి ఒక గ్రేట్ గెస్చర్ అని చెప్పాలి. ఇక మేకింగ్ విషయానికి వస్తే మాత్రం సుకుమార్ అండ్ యూనిట్ వర్క్ సెట్ లో సాలిడ్ గా ఉందని చెప్పాలి. యూనిట్ మొత్తం కష్టం.. సుకుమార్ సన్నివేశాలు వివరించే విధానాలు ఆసక్తిగా అనిపిస్తున్నాయి. దీనితో రేపు రాబోయే ట్రైలర్ పై మరిన్ని అంచనాలు రేకెత్తుతున్నాయి.

Share.