పునీత్ కుటుంబాన్ని పరామర్శించిన పెద్దిరెడ్డి?

Google+ Pinterest LinkedIn Tumblr +

దివంగత నటుడు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించిన విషయం తెలిసిందే. మరణించి దాదాపు నెల రోజులు దాటిన కూడా ఆయన జ్ఞాపకాలు ఇంకా కళ్లముందు మెదులుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఆయన మరణవార్తను కుటుంబ సభ్యులు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవలే పునీత్ కుమార్ చనిపోయిన నెల రోజులు అయిన సందర్భంగా అతని భార్య అశ్విని, అన్నా శివ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు కలిసి పునీత్ సమాధికి పూజలు చేశారు.

ఇది ఇలా పునీత్ కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు. బెంగళూరులోని పునీత్ రాజ్ కుమార్ ఇంటికి వెళ్లి అతని భార్య అశ్వినీ తో మాట్లాడారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ పునీత్ అకాల మరణం చాలా బాధించిందని పేర్కొన్నారు.చిన్నవయసులోనే ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసి ఎంతో మందిని ఆదుకున్న గొప్ప మానవతావాది పునీత్ అనే పెద్దిరెడ్డి అన్నారు.

Share.