నిర్మాతగా స్కైలాబ్ సినిమా నిత్యామీనన్ కు కలిసి వచ్చిందా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

మొదటిసారి హీరోయిన్ నిత్యా మీనన్ నిర్మాతగా స్కైలాబ్ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగులు వేసింది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ కామెడీ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో సత్యదేవ్ హీరోగా.. నిత్యా మీనన్ హీరోయిన్ గా.. రాహుల్ రామకృష్ణ, సుబ్బరాయశర్మ, తనికెళ్ల భరణి ,అరిపిరాల సత్యప్రసాద్, తులసి, తరుణ్ భాస్కర్ ,నారాయణరావు తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాకు దర్శకుడిగా విశ్వాస్ ఖండే రావు దర్శకత్వం వహించారు. ఇకపోతే ఈ సినిమా నిన్న థియేట్రికల్ గా రిలీజ్ అయింది. సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను అలరించడం తో ఒక మోస్తరుగా థియేట్రికల్ బిజినెస్ ఐతే జరిగింది.

ఇక స్కైలాబ్ సినిమాకి మొత్తంగా చూసుకుంటే రూ.2.95 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరగగా, ఇక ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ రావాలి అంటే మరో మూడు కోట్ల రూపాయల షేర్ ను రాబాట్టాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ సినిమాకు ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే .. టార్గెట్ చేయడం సులభమవుతుంది.. లేదంటే ఇక వచ్చే వారంలో గుడ్ లక్ సఖి, లక్ష్య వంటి సినిమాలు విడుదల అవుతున్నాయి కాబట్టి టార్గెట్ బ్రేక్ చేయడం కష్టమే అనిపిస్తుంది. ఇక నిత్య మీనన్ నిర్మాతగా నిలదొక్కుకుంటారా లేదా అనే విషయం తెలియాలంటే మరీ ఒక వారం వేచి చూడక తప్పదు.

Share.