వైట్ పేపర్ సినిమా టీమ్ కి అభినందనలు తెలిపిన రోజా?

Google+ Pinterest LinkedIn Tumblr +

సాధారణంగా సినిమా తీయడానికి కొన్నిసార్లు నెలలు పట్టవచ్చు, మరికొన్నిసార్లు రోజులు, కొన్ని సార్లు సంవత్సరాలు పట్టవచ్చు. కానీ తమిళంలో స్వయంవరం అనే సినిమాను 24 గంటల్లో పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఆది కార్డు ని బద్దలు కొడుతూ కేవలం 10 గంటల్లో మాత్రమే వైట్ పేపర్ అనే సినిమాను తీశారు. ఈ సందర్భంగా నటి ఎమ్మెల్యే రోజా వైట్ పేపర్ టీమ్ అభినందనలు తెలిపింది.

జబర్దస్త్ కమెడియన్ అభి హీరోగా నటించిన ఈ సినిమా హిట్ కావాలి అని రోజా తెలిపింది. ఈ సినిమాలో అదిరే అభి, అభినయ కృష్ణ వాణి, తల్లాడ సాయి కృష్ణ, స్నేహ, నందకిషోర్ ప్రధానపాత్రలో నటించిన చిత్రం వైట్ పేపర్. శివ దర్శకత్వంలో శివ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా టీజర్ ను తాజాగా రోజా విడుదల చేశారు. కేవలం నాలుగు కెమెరాలతో ఈ సినిమాను షూట్ చేశాం. మా ప్రయత్నానికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు సత్కరించారు. త్వరలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎక్క నుంది అని తెలిపారు అభి.

Share.