ఏఎన్నార్ ను ఇమిటేట్ చేసిన బాలకృష్ణ?

Google+ Pinterest LinkedIn Tumblr +

నందమూరి నట సింహం బాలకృష్ణ అటు వెండి తెరపై, ఇటు బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇంతవరకు బాలయ్య అభిమానులు ప్రేక్షకులు ఎవరూ చూడని మరొక యాంగిల్ ను అన్ స్థాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో ద్వారా చూపిస్తున్నారు. తెలుగులో ఓటీటీ ఆహా ప్లాట్ ఫాం లో ప్రసారం అవుతున్న ఈ షో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ షోకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే మొదటి ఎపిసోడ్ కు మంచు ఫ్యామిలీ వచ్చారు.

ఇక రెండవ ఎపిసోడ్ కు హీరో నాని వచ్చి సందడి సందడి చేశారు. ఇక తాజాగా మూడవ ఎపిసోడ్ కోసం నటుడు, టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం, దర్శకుడు అనిల్ రావిపూడి ని ఆహ్వానించారు. సరదాగా సాగిన ఈ ఎపిసోడ్లో ఏఎన్నార్ ను బాలయ్య ఇమిటేట్ చేసిన వీడియోను ఆహా ప్రత్యేకంగా విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బ్రహ్మానందం కోరికమేరకు బాలకృష్ణ దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారిని అనుసరించి చాటింగ్ చేస్తూ డైలాగులు చెప్పారు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం విడుదలవుతోంది.

Share.