అఖండ సినిమా చూస్తూ హఠాన్మరణం పొందిన బాలయ్య అభిమాని..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత బాలకృష్ణ నటించిన ఒక్క సినిమా బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధిస్తూ ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసేసింది.. ఇది చూసిన బాలయ్య అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయితే ఈ సమయంలో ఒక ప్రముఖ ఎగ్జిబ్యూటర్ అలాగే బాలయ్య అభిమాని హఠాన్మరణం చెందడం తో అందరినీ విషాదంలోకి నెట్టింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రముఖ సినీ ఎగ్జిబిటర్ అయిన జాస్తి రామకృష్ణ .. శ్యామల థియేటర్ లో అఖండ సినిమా చూస్తూనే అలాగే ప్రాణాలు కోల్పోయారు.

సినిమా వీక్షిస్తున్న అప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి అక్కడికక్కడే మరణించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే థియేటర్ యాజమాన్యం వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న నామవరం వి ఎస్ మహల్ అనే థియేటర్ ఓనర్ గా తన కెరీర్ను ప్రారంభించిన రామకృష్ణ, ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు. జిల్లా సినీ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, వింటేజ్ క్రియేషన్స్ అధినేతగా ఆయన వ్యవహరిస్తున్నారు. బాలయ్య అంటే ఎనలేని ప్రాణం. అలాంటి బాలయ్య సినిమా చేస్తున్నప్పుడే ఆయన మరణించడం చాలా దారుణం అని పలువురు కంటతడి పెడుతున్నారు.ఈయనకు భార్య శిరీష , ఇద్దరు పిల్లలు కూడా ఉండడం గమనార్హం.

Share.