అభిమానులకు ఆడియో సందేశం ఇచ్చిన సాయి ధరమ్ తేజ్?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవలె బైక్ యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చారు. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నాడు.ఈ నేపథ్యంలోనే తన అభిమానులకు ఆడియో ద్వారా సందేశం ఇచ్చారు సాయి ధరమ్ తేజ్. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమా నవంబర్ 26న ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ ఈ విధంగా వాయిస్ మెసేజ్ ఇచ్చారు..

నేను మీ సాయి ధరమ్ తేజ్.. మీరు నా మీద చూపించిన ప్రేమకు ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాను. నా ఆరోగ్యం పట్ల మీరు చూపించిన శ్రద్ధ ఎప్పటికీ మర్చిపోలేను.రిపబ్లిక్ సినిమాను మీతో కలిసి చూడలేకపోయాను.అదే ఈ నవంబర్ 26న ఈ సినిమా జీ ఫైవ్ లో విడుదల కానుంది. సినిమా చూసిన తర్వాత ఆమె అభిప్రాయాలు నాకు తెలపండి అంటూ వాయిస్ మెసేజ్ పంపారు సాయి ధరమ్ తేజ్.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Share.