అరిటాకులో భోజనం ఆరగిస్తున్న మిల్క్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది.ప్రస్తుతం ఎఫ్ 3, భోలా శంకర్ ఇలాంటి సినిమాల్లో నటిస్తోంది. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు యాడ్స్ చేస్తూ రెండు వైపులా డబ్బులను సంపాదిస్తోంది. ఈ క్రమంలోనే ఒక యాడ్ షూటింగ్ లో భాగంగా బ్రేక్ సమయంలో తమన్నా ఒక దేవత రూపంలో కనిపించింది.ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఒంటినిండా ఆభరణాలు ధరించి, తలపై కిరీటం పెట్టుకుని భారతీయ సంప్రదాయం ప్రకారం అరిటాకులో భోజనం చేస్తూ కనిపించింది. ఈ ఫోటోలో తమన్నా ఓపిక గా కూర్చుని తెలుగు వంటకాల రుచిని ఆస్వాదిస్తోంది.

ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అరిటాకు ముందు కూర్చుని తిన్న ప్రతిసారి నేను దేవతల ఫీల్ అవుతాను అంటూ చెప్పుకొచ్చింది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు నిజం చెప్పాలి అంటే బ్లాక్ చీరలో ఆభరణాలలో తమన్నా నిజంగా అందాల దేవత గుర్తుచేస్తోంది ఉంటున్నారు.

Share.