ఏపీ వరదబాధితులకు అన్ని లక్షల డొనేట్ చేసిన గీతా ఆర్ట్స్?

Google+ Pinterest LinkedIn Tumblr +

గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో కుంభ కోత వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాలలో గ్రామాలు జలమయమయ్యాయి. నెల్లూరు, తిరుపతి లాంటి ప్రాంతాలలో వరద బీభత్సానికి ఇప్పటికే ప్రజలు పెద్ద ఎత్తున నష్టపోయారు. ఈ వరదలో ఇప్పటికే చాలామంది అదృష్యం అయ్యారు. ఈ వరద బాధితులకు పలువురు తమకు చేతనైన సహాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తిరుపతి వరద బాధితులకు ఆపన్నహస్తం అందించింది.వరద బాధితుల సహాయార్థం 10 లక్షలు ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కి డొనేట్ చేసింది.

ఇదే విషయాన్ని గీతా ఆర్ట్స్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఏపీ లోని వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యల కోసం తమవంతు సహాయం చేసినట్లు పేర్కొంది.

ఇప్పటికే ఏపీలో నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాలో నదులు,వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద నాటికి వందలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ఈ భారీ వర్షాలకు వేలాది ఎకరాల పంటలు నీట మునిగాయి. ప్రాంతాలలో చెరువులకు గండి పడే సూచనలు కనిపిస్తుండటంతో అధికారులు అప్రమత్తమై అక్కడ ఉన్న వారిని ఖాళీ చేయిస్తున్నారు.

Share.