దృశ్యం-2 సినిమా లో హైలెట్స్ ఇవే..!

Google+ Pinterest LinkedIn Tumblr +

Aగత రెండు నెలలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆసక్తి రేపుతున్న ఎన్నో సినిమాలలో విక్టరీ వెంకటేష్ నటించిన దృశ్యం సినిమా కూడా ఒకటి.. దృశ్యం సినిమా వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. దృశ్యం సినిమా కు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో నిన్న రాత్రి రిలీజ్ అయింది. ఆరేళ్ల క్రితం క్లోజ్ అయిన ఒక కేసును పోలీసులు మళ్ళీ ఓపెన్ చేసి, విచారణ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో దృశ్యం 2 సినిమాకు అంకురార్పణ చేశారు.

ముఖ్యంగా కథ లో అదిరిపోయే మలుపులు ఉన్నాయి.. కథ లో పోలీసుల కంటే అన్ని విషయాలలో ముందే ఉండడం రాంబాబు స్పెషాలిటీ అని చెప్పాలి.. దృశ్యం వన్ లో తనకున్న తెలివే తనను తన కుటుంబాన్ని కాపాడుతుంది. అయితే ఇప్పుడు అవే తెలివితేటలను దృశ్యం 2 లో వాడేశాడు దర్శకుడు జీతూ జోసెఫ్.. వరుణ్ శవం ఎక్కడుందో అనే విషయం అందరికీ తెలిసినా..పోలీసులకు ఏమాత్రం తెలియకుండా.. భలే చేశారు.. మరి దానిని పోలీసులు ఎలా కనుక్కున్నారు అన్నది ఈ సినిమాలో ట్విస్టింగ్ పాయింట్. పోలీసులకు శవం దొరికినా.. చేసింది రాంబాబే అని తెలిసినా.. రాంబాబు పోలీసుల నుంచి ఎలా తప్పించుకున్నాడు అనేది ఈ సినిమా కాన్సెప్ట్.

Share.