సినిమా టికెట్ల విషయంపై.. సీఎం జగన్ కు విజ్ఞప్తి చేసినా మెగాస్టార్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టికెట్ల ధర విషయంపై మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది చిరంజీవి. వాటి గురించి చూద్దాం.

పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్లైన్ టికెటింగ్ బిల్ ప్రవేశ పెట్టడం హర్షించదగ్గ విషయం మేనని చిరంజీవి తెలియజేశాడు. అదే విధంగా థియేటర్ల మనుగడ కోసం, సినిమానే ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాల బతుకు తెరువు కోసం, తగ్గించిన టికెట్స్ రేట్స్ ను కాలానుగుణంగా, సముచితం గా దేశం లోని అన్ని స్టేట్స్ లో ఉన్న విధంగా నిర్ణయిస్తే పరిశ్రమ కి మేలు జరుగుతుంది అని తెలిపారు. దాంతో సినీ పరిశ్రమ బాగు పడుతుందని తెలియజేశారు. దేశమంతా ఒకటే జీఎస్టీ గా ప్రభుత్వాలు పన్నులు తీసుకుంటున్నప్పుడు, టికెట్ ధరలలో కూడా అదే వెసులుబాటు ఉండటం సమంజసం అని అన్నారు. దయచేసి ఈ విషయమై పునరాలోచన చేయాలని సీఎం జగన్ ను విన్నవించారు చిరంజీవి. మీలాంటి వారి ప్రోత్సాహం ఉన్నప్పుడే తెలుగు పరిశ్రమ నిలదొక్కుకోగలుగుతుంది అని తెలిపారు.

మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా వేదిక గా చేసిన ఈ వ్యాఖ్యల పట్ల పలువురు స్పందిస్తున్నారు. ఈ విషయం పై సీఎం జగన్ మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే కొద్దిరోజులాగాల్సిందే.

Share.