బోల్డ్ ఫోటోతో మరొకసారి రెచ్చిపోయిన కంగనా?

Google+ Pinterest LinkedIn Tumblr +

బాలీవుడ్ బ్యూటీ, ఫైర్ బ్రాండ్ కంగనారనౌత్ నిత్యం ఏదో ఒక వివాదంతో తరచూ సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటుంది. ఇటీవలే ఆమె పద్మశ్రీ అవార్డు ను అందుకున్న విషయం తెలిసింది. భారత స్వాతంత్రం గురించి ఆమె కామెంట్స్ చేసి వివాదంలో చిక్కుకుంది. ఆ వివాదం సద్దుమణిగింది అనుకునేలోపే సిక్కు మతాల గురించి మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మరో వివాదానికి తెరలేపినట్టు అయింది. ఆమె పై సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ శిరోమణి అకాలిదళ్ ముంబై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాయి.

ఈ కేసుపై కూడా కంగనా కాస్త ఘాటుగానే స్పందించింది. తాజాగా ఈ బ్యూటీ ఒక బోల్డ్ ఫోటోను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. బ్లాక్ అండ్ బ్లాక్ టూ పీస్ డ్రెస్ లో ముందు గ్లాస్ చేతపట్టుకుని సెక్సీ లుక్ లో దర్శనమిచ్చింది. ఆ ఫోటోని షేర్ చేస్తూ ఇంకో రోజు ఇంకో ఎఫ్ఐఆర్. ఒకవేళ వారు నన్ను అరెస్ట్ చేయడానికి వస్తే నా మూడ్ ఇలానే ఉంటుందని డానికి కాప్షన్ ఇచ్చింది. తనకు ఎటువంటి భయం లేదని పోలీసులు అరెస్ట్ చేయలేరని అని చెప్పకనే చెబుతుంది అని కామెంట్ చేస్తున్నారు. మరి పోలీసులు ఆమె పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు చూడాలి మరి..

Share.