అల్లు అరవింద్ గొప్ప మనసుతో ఏపీ కి.. విరాళం ప్రకటించిన గీతాఆర్ట్స్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అకాల వర్షాల తెలుగు రాష్ట్రాలలో విపరీతంగా వర్షాలు నమోదయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి, నెల్లూరు ప్రాంతాలను వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ప్రాంతాలలోని ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వాటితో పాటే కొంతమంది ఇది ప్రజల ఇండ్లు వంటివి ఇక దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్పందిస్తూ ఇల్లు ఇంటితో పాటు మరి కొంత ఆర్థిక సహాయం కూడా అందిస్తోంది.అయితే వరద బాధితులను ఆదుకోడానికి పలువురు తమవంతు సాయం అందచేస్తున్నారు. అయితే తాజాగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కూడా వరద బాధితుల కోసం ఆర్థిక సాయం అందించింది.

తిరుపతి వరద బాధితుల కోసం రూ.10 లక్షలను ఏపీ సీఎం సహాయనిధికి విరాళంగా ఇచ్చింది. ఈ విషయాన్ని గీతా ఆర్ట్స్‌ స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం తమవంతు సహాయం అందించినట్టు చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నప్పటికీ అల్లు అరవింద్ తన వంతు సహాయం చేయడం గమనార్హం.

Share.