పార్టీలో..ఒళ్ళు కనిపించేలా డ్యాన్స్ చేసిన హీరోయిన్ అక్క..?

Google+ Pinterest LinkedIn Tumblr +

లోఫర్’ తో టాలీవుడ్‌ ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైన దిశాపటాని ఈ సినిమాలో అందాల ఆరబోత ప్రదర్శించిన ప్పటికీ ఇక్కడ పెద్దగా క్లిక్ అవ్వకపోవడంతో బాలీవుడ్లో సెటిల్ అయిన సంగతి తెలిసిందే. ‘ఎమ్‌ఎస్‌ ధోనీ’, ‘భాగీ-2′,’భాగీ -3’ వంటి సినిమాలలో నటించి మంచి క్రేజ్ ను సంపాధించుకుంది దిశా పాఠాని . ఇక సోషల్ మీడియాలో కూడా దిశా పాఠానికి ఫాలోయింగ్ ఎక్కువే. ఆమె లానే ఆమె సోదరి ఖుష్బూ పటానీ కూడా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యింది. ఆమె ఇంకా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకపోయినప్పటికీ ఆమె గ్లామర్‌ ఫోటోలతో నెటిజన్లను ఆకర్షిస్తుంటుంది.

తాజాగా ఈమె ఓ పార్టీలో ఒళ్ళు తెలీనంతగా టేబుల్ ఎక్కి మరీ డ్యాన్స్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది.దానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఖుష్బూ ఇండియన్‌ ఆర్మీలో లెప్టెనెంట్‌గా విధులను నిర్వర్తిస్తోంది.ఆమె ఆర్మీలో పనిచేస్తున్నప్పటికీ ఫిట్‌నెస్‌ పై అలాగే గ్లామర్ పై ప్రత్యేక శ్రద్ద పెడుతుంటుంది.ఈమె వర్కౌట్ వీడియోలు కూడా ఎప్పటికప్పుడు వైరల్ అవుతుంటాయి. అయితే పార్టీలో ఖుష్బూ డ్యాన్స్ వీడియో పై మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతో బాధ్యతగల ఆర్మీలో పనిచేస్తూ ఇవేం పనులు అంటూ నెటిజన్లు ఆమె పై మండిపడుతున్నారు. అయితే ఈ విషయంపై ఆమె ఎలా స్పందిస్తుందో తెలియాలి.

https://www.instagram.com/reel/CWngTjXDIck/?utm_source=ig_web_button_share_sheet

 

 

 

Share.